Posts

Sanatana dharma / సనాతన ధర్మ వైశిష్ట్యం

Image
  సనాతన ధర్మము వైశిష్ట్యము Sanatana dharma ఈ ప్రపంచము నందు అనేకానేక మతములు పుట్టి చాలావరకూ సమసిపోయినవి కూడా. అనేక మతములకు పుట్టిన తేదీ పుట్టించిన వారి  నామము సమసిపోయిన సమయములు కలవు.  కానీ అన్నిటియందు ఉత్కృష్టమై అజరామరమై అపూర్వమై అనితర సాధ్యమై న భూతో న భవిష్యత్ అన్న చందంగా వెలుగొందుతూ ఈ ప్రపంచానికి అనేక కోట్ల సంవత్సరాలుగా జ్ఞాన వెలుగులను ప్రసాదిస్తున్నది కేవలము సనాతన ధర్మము మాత్రమే అని చెప్పుట ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.  ఈ సనాతన ధర్మమునే భారతాన హిందూ మతము అని పిలుస్తారు, కానీ ఇది మతము ఏ మాత్రమూ కాదు. ఇది యొక జీవన విధానము. ఈ హైందవ సనాతన ధర్మ జీవన విధానము ఈ విశ్వముననే అత్యంత ఉత్కృష్టమై వెలుగొందుతున్నది.  సనాతన ధర్మము అతి ప్రాచీనమైనదైననూ నిత్య నూతనమైనది. అత్యంత పవిత్రమైన జీవనము, స్వచ్ఛమైన మానసిక స్థాయి, హృదయమునందు తృప్తి, ఆనందము, వసుధైవ కుటుంబకం అన్న భావన  కేవలము సనాతన ధర్మ మార్గముననే పొందగలము. ఈ విశ్వము యెంత పురాతనమైనదో సనాతన ధర్మము కూడా అంతటి పురాతనమైనది. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకూ సనాతన ధర్మ జ్ఞాన వెలుగులు విశ్వమంతా ప్రసరిస్తూనే ఉంటాయి.  స్వామి వివేకా...