Sanatana dharma / సనాతన ధర్మ వైశిష్ట్యం

 సనాతన ధర్మము వైశిష్ట్యము

Sanatana dharma


ఈ ప్రపంచము నందు అనేకానేక మతములు పుట్టి చాలావరకూ సమసిపోయినవి కూడా. అనేక మతములకు పుట్టిన తేదీ పుట్టించిన వారి  నామము సమసిపోయిన సమయములు కలవు. 

కానీ అన్నిటియందు ఉత్కృష్టమై అజరామరమై అపూర్వమై అనితర సాధ్యమై న భూతో న భవిష్యత్ అన్న చందంగా వెలుగొందుతూ ఈ ప్రపంచానికి అనేక కోట్ల సంవత్సరాలుగా జ్ఞాన వెలుగులను ప్రసాదిస్తున్నది కేవలము సనాతన ధర్మము మాత్రమే అని చెప్పుట ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు. 

ఈ సనాతన ధర్మమునే భారతాన హిందూ మతము అని పిలుస్తారు, కానీ ఇది మతము ఏ మాత్రమూ కాదు. ఇది యొక జీవన విధానము. ఈ హైందవ సనాతన ధర్మ జీవన విధానము ఈ విశ్వముననే అత్యంత ఉత్కృష్టమై వెలుగొందుతున్నది. 

సనాతన ధర్మము అతి ప్రాచీనమైనదైననూ నిత్య నూతనమైనది. అత్యంత పవిత్రమైన జీవనము, స్వచ్ఛమైన మానసిక స్థాయి, హృదయమునందు తృప్తి, ఆనందము, వసుధైవ కుటుంబకం అన్న భావన  కేవలము సనాతన ధర్మ మార్గముననే పొందగలము.

ఈ విశ్వము యెంత పురాతనమైనదో సనాతన ధర్మము కూడా అంతటి పురాతనమైనది. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకూ సనాతన ధర్మ జ్ఞాన వెలుగులు విశ్వమంతా ప్రసరిస్తూనే ఉంటాయి. 

స్వామి వివేకానంద అన్నట్లుగా సైన్సు అభవృధ్ధి చెందిన కొద్దీ సనాతన ధర్మ వైశిష్ట్యం పెరుగుతుంది. కావున మనమందరమూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ అవలంబిస్తూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం. 

ఈ బ్లాగులో సనాతన ధర్మ విషయములను అనేకానేకము చర్చిస్తూ అవగాహన చేసుకుంటూ ముందుకు వెళదామని ఆశిస్తూ 

గుండు వంశీ కృష్ణ



Comments

  1. ధర్మో రక్షతి రక్షితః అని కదా. ధర్మమును రక్షించవలెనంటే ఏమి చేయాలి? ధర్మము యొక్క జ్ఞానమును సంపాదించాలి. అది ఎట్లా?
    అది ఆచార పరంపరాగతమైనది. అది ఇప్పుడు మొదలైంది కాదు. దానినే పెద్దలు " ఏష ధర్మస్సనాతనః " అని అన్నారు అట్టి విషయమై జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఉపదేశించిన మార్గములు ఉన్నవి.
    అతః పూర్వము ఇట్టి ధర్మములను సనాతనములైన వానిని భగవాన్ వేదవ్యాసులవారు పురాణాల రూపములో అందించి నారు.
    అట్టివానిని గురువుల ద్వారి చక్కగా తెలుసుకొని చక్కగా అవలోకనము చేసి ఆచారణలోకి తీసుకువస్తే అంతకన్నా గొప్పనైనదీ ఏముంటుంది ? ఈ విధమైన మార్గములో పయనించినప్పుడు మాత్రమే సనాధర్మమును కపాడుటలో మనము సఫలీకృతము అవుతాము.
    సనాతన ధర్మము వర్థిల్లాలి.
    సనాతన ధర్మము వర్థిల్లాలి.
    సనాతన ధర్మము వర్థిల్లాలి.
    ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాన్తి

    ReplyDelete

Post a Comment